ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. 20 ఏళ్ల యువతిని నిద్రలోనే చంపేశాడు

కర్నాటకలోని హుబ్బల్లిలో 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి తన ప్రేమను తిరస్కరించినందుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

By అంజి  Published on  15 May 2024 10:00 AM GMT
Karnataka, Crime, Hubballi

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం.. 20 ఏళ్ల యువతిని నిద్రలోనే చంపేశాడు

కర్నాటకలోని హుబ్బల్లిలో 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి తన ప్రేమను తిరస్కరించినందుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహిళ నిద్రలో ఉన్న సమయంలో వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటన హుబ్బళ్లిలోని వీరాపుర లేన్‌లో చోటుచేసుకుంది. బాధితురాలిని అంజలి అంబిగేరాగా గుర్తించారు.

ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు విశ్వ అలియాస్ గిరీష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 'వీర్‌పుర ఓని గ్రామ సమీపంలో అంజలి అనే యువతి హత్యకు గురైంది. ఈరోజు ఉదయం ఓ దుండగుడు ఆమెను వారి ఇంట్లోనే కత్తితో పొడిచి చంపాడు. కేసు నమోదు చేసి ప్రస్తుతం ఈ విషాద ఘటన వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి తదుపరి దర్యాప్తు జరుపుతున్నాం' అని హుబ్బళ్లి ధార్వాడ్‌ ఎస్పీ గోపాల్‌ బయాకోడ్‌ తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Next Story