దారుణం.. ఆవుతో అసహజ సంభోగం.. వ్యక్తి అరెస్ట్

Karnataka Man Arrested For Unnatural Sex With Cow. కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఆవుపై అఘాయిత్యానికి

By అంజి  Published on  25 Feb 2022 4:26 PM IST
దారుణం.. ఆవుతో అసహజ సంభోగం.. వ్యక్తి అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఆవుపై అఘాయిత్యానికి ఓడిగట్టాడు. ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తిని వెంకటేష్ (22)గా గుర్తించి, దావణగెరె నివాసి అని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని సింగపుర లేఅవుట్‌లో ఆవుతో అసహజ సంభోగం చేస్తూ నిందితుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఐదు ఆవులు, ఆరు దూడలను తన గోశాలలో ఉంచిన ముని హనుమంతప్ప వెంకటేష్‌ను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు ఆవుపై అత్యాచారం చేయడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు హనుమంతప్పకు సమాచారం అందించారు. అనంతరం వెంకటేష్‌ను పట్టుకునేందుకు హనుమంతప్ప గోశాల వద్దకు వెళ్లాడు. నిందితుడు తన బట్టలు విప్పి, ఆవుతో అసహజ సంభోగంలో మునిగిపోయాడు. నిందితుడిని పట్టుకున్న హనుమంతప్ప వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story