కర్ణాటకలోని ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం బట్టబయలైంది. మహిళ తనకు ఆడపిల్ల ప్రసవించిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే చివరకు మగబిడ్డ మృతదేహాన్ని అప్పగించారని ఆరోపించింది. కొప్పల్ జిల్లా ప్రసూతి, పిల్లల ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
గౌరీ సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో చేరారు, సెప్టెంబర్ 25 తెల్లవారుజామున ప్రసవించారు. శిశువు బరువు తక్కువగా ఉన్నందున, నవజాత శిశువును వెంటనే పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)కి తరలించారు. తనకు ఆడపిల్ల పుట్టిందని వైద్య సిబ్బంది మొదట్లో తనకు తెలియజేశారని గౌరీ చెప్పారు. అయితే అక్టోబరు 2న పాప చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది విషాద వార్తను వెల్లడించారు.
గౌరీ, ఆమె కుటుంబ సభ్యులు బిడ్డను చూసేందుకు వచ్చినప్పుడు, మరణించిన శిశువు మగపిల్లాడని, వారు అమ్మాయి కాదని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. "మాకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పారు, కానీ ఇప్పుడు చనిపోయిన అబ్బాయిని మాకు అప్పగించారు. మాకు మా బిడ్డ తిరిగి కావాలి" అని గౌరి బాధతో చెప్పింది.
ఆసుపత్రి అధికారులు, పొరపాటు జరిగే అవకాశాన్ని అంగీకరించారు. డిపార్ట్‌మెంట్ల మధ్య నవజాత శిశువును బదిలీ చేసే సమయంలో మిక్స్-అప్ సంభవించవచ్చని పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.