సెలూన్‌లో బ్యూటీషియన్‌పై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

Karnataka Congress leader arrested for sexually assaulting a female employee in a salon. మహిళ బ్యూటీషియన్‌పై లైంగిన వేధింపులకు పాల్పడ్డాడో కాంగ్రెస్‌ నేత. మహిళను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.

By అంజి  Published on  18 Sept 2022 5:25 PM IST
సెలూన్‌లో బ్యూటీషియన్‌పై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

మహిళ బ్యూటీషియన్‌పై లైంగిన వేధింపులకు పాల్పడ్డాడో కాంగ్రెస్‌ నేత. మహిళను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో జరిగింది. సెలూన్‌లో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు మనోజ్ కర్జాగి శనివారం సెలూన్‌కి వచ్చి తనను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

మహిళ తన తన స్నేహితుడికి కాల్‌ చేసి అప్రమత్తం చేయడంతో అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చి కాంగ్రెస్ నాయకుడిని కొట్టారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులతోపాటు ఇతర ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. సదరు నేత గతంలో ఓ మంత్రికి సహాయకుడిగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాయువ్య కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ మాజీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రితో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

Next Story