ఓ ఇంటికి తీసుకెళ్లి.. మైనర్‌ బాలికపై లైంగిక దాడి.. కర్ణాటక బస్సు డ్రైవర్ అరెస్ట్

Karnataka bus driver held for sexual assault on Minor girl. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల్లో మాత్రం

By అంజి  Published on  31 Jan 2022 8:41 AM GMT
ఓ ఇంటికి తీసుకెళ్లి.. మైనర్‌ బాలికపై లైంగిక దాడి.. కర్ణాటక బస్సు డ్రైవర్ అరెస్ట్

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా స్నేహాం చేస్తున్నట్లు నటించి ఓ బస్సు డ్రైవర్‌ మైనర్‌ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని కావూర్ వద్ద 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 32 ఏళ్ల బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాగల్‌కోట్ జిల్లాకు చెందిన నిందితుడు కొద్దిరోజుల క్రితం బాలికను కావూరులోని ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. జనవరి 30వ తేదీన బాలికపై బస్సు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

పాండేశ్వర్‌ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఆధారంగా, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితుడిని ఆదివారం అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వ్యక్తి బాగల్‌కోట్‌కు చెందిన దయానంద (32)గా గుర్తించబడి, మంగళూరులో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ మైనర్ బాలిక తన బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో స్నేహం చేశాడు. అనంతరం ఆమెను ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఈ మేరకు పాండేశ్వర్‌లోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు మేరకు పాండేశ్వర్ మహిళా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story
Share it