భార్యతో అక్రమ సంబంధం.. అనుమానంతో తమ్ముడిని చంపిన అన్న

Kanpur man beats his brother to death on suspicion of having an affair with his wife. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో

By అంజి  Published on  29 Sept 2022 2:45 PM IST
భార్యతో అక్రమ సంబంధం.. అనుమానంతో తమ్ముడిని చంపిన అన్న

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు డాబాపై నుంచి కిందకు వచ్చి చూడగా రక్తంతో తడిసిన మృతదేహాన్ని చూసి చలించిపోయారు. తన సోదరుడికి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నిందితుడు అనుమానించడంతో ఈ నేరం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఏడాది మే 18న ధనంజయ్‌ వివాహం జరిగిందని అతని తండ్రి జగదీష్‌ యాదవ్‌ తెలిపారు. అతని చిన్న కుమారుడు శివ్ బహదూర్ సింగ్ (29) కూడా ఇంట్లోనే ఉండేవాడు. శివ బహదూర్ శనివారం రాత్రి వరండాలో నిద్రిస్తున్నాడు. మిగతా అందరూ డాబా మీద పడుకున్నారు.

అర్థరాత్రి, ధనంజయ్ నిద్రిస్తున్న సమయంలో శివ బహదూర్‌పై కర్రలతో దాడి చేయడం ప్రారంభించాడు. సంఘటన జరిగిన తర్వాత పరారీలో ఉన్న అతన్ని (సెప్టెంబర్‌ 29)న బుధవారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. తన సోదరుడు శివ బహదూర్ తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించాడని అతను వెల్లడించాడు. అతన్ని చంపడానికి అవకాశం కోసం ఎదురుచూశాడు. సెప్టెంబరు 10న నిద్రిస్తున్న తమ్ముడిపై కర్రతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం రక్తంతో తడిసిన బట్టలు మార్చుకుని ధనంజయ్ మోటార్ సైకిల్ పై పరారయ్యాడు. నిందితుడిని బుధవారం ఉదయం రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు.

Next Story