నేటి సమాజంలో సినిమాల ప్రభావం అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా మారింది. కొంతమందిపై సినిమాలు ఎంతగానో ప్రభావాన్ని చూపుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చే సినిమాల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటోంది. తాజాగా ఓ కేసులో నిందితుడు దండుపాళ్యం సినిమా నుండి ప్రేరణ పొంది దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలి హత్య.. అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే ఈ దోపిడి హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దండుపాళ్యం సినిమా తరహాలో నిందితుడు హత్యతో పాటు దోపిడీకి పాల్పడ్డాడు. దండుపాళ్యం సినిమా చూసి.. పక్కా ప్లానింగ్‌తో హత్య చేసి, దోపిడీ చేశాడు.
3 నెలల పాటు 8 ప్రత్యేక పోలీసు బృందాలు ఎంతగానో శ్రమించి కేసును ఛేదించారు. ఐదు రాష్ట్రాల్లో గాలంపు, ఎన్నో ఫోన్ కాల్స్ విశ్లేషణ, 5 వేల మంది అనుమానితుల విచారణతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 30 అధికారులు, సిబ్బందితో ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. కరుడు గట్టిన నేరస్తుడి నుండి ఏకంగా 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలో నిందితుడిపై 7 కేసులు ఉండగా, కదిరిలో 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బైక్‌లను పెట్రోల్ దొంగతనం మొదలు పెట్టిని నిందితుడు.. చివరకు దండుపాళ్యం సినిమా తరహాలో హత్య చేశాడు.