రిసార్టుకు తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి.. జూనియర్ ఆర్టిస్ట్‌ అరెస్ట్.. హైదరాబాద్‌లో ఘటన

Junior artist arrested for sexually assaulting woman in Hyderabad. హైదరాబాద్: పెళ్లి సాకుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన జూనియర్ ఆర్టిస్టును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  12 Oct 2022 3:46 PM IST
రిసార్టుకు తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి.. జూనియర్ ఆర్టిస్ట్‌ అరెస్ట్.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్: పెళ్లి సాకుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన జూనియర్ ఆర్టిస్టును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సినీ షూటింగ్‌ సమయంలో ప్రియాంత్‌ అనే జూనియర్‌ ఆర్టిస్ట్‌తో బాధితురాలి పరిచయమైంది. ఈ క్రమంలోనే యువతితో జూనియర్ ఆర్టిస్ట్‌ చనువు పెంచుకున్నాడు. యువతి కూడా అతడిని నమ్మింది. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రియాంత్ యువతిని నమ్మించాడు. ఆ తర్వాత పలు సందర్భాల్లో బాధితురాలిని రిసార్టు, హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత బాధితురాలు పెళ్లికి పట్టుబట్టింది. వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిని అడిగింది. అయితే ప్రియాంత్ ఏదో ఒక సాకుతో దూరం పెట్టుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రియాంత్‌ను బుధవారం అరెస్టు చేశారు.

Next Story