శాడిస్టు భర్త.. అలా కూర్చోవాలని, మూత్రం తాగాలని వేధింపులు
Jubilee hills police files fir against sadist husband.ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా
By తోట వంశీ కుమార్ Published on 29 Oct 2021 4:42 AM GMT
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి సైకో అవతారమెత్తాడు. కులం పేరుతో దూషించడమే కాకుండా.. చిత్రహింసలు పెట్టేవాడు. అర్థనగ్నంగా ఉండాలని.. మూత్రం తాగాలని వేదించేవాడు. భర్తకు అతడి కుటుంబ సభ్యులు కూడా వత్తాసు పలికేవారు. అతడి వేదింపులు రోజు రోజుకు తీవ్రం అవుతుండడంతో ఆ భార్య జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఓ మహిళ 2016లో ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తరువాత వాళ్లు హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో కాపురం పెట్టారు. కొద్ది రోజుల పాటు మంచిగానే ఉన్నా.. తరువాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. అప్పటి నుంచి భర్త వేదింపులు ప్రారంభం అయ్యాయి. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించేవారు.
పెట్రోల్ పోసి చంపేస్తానని పలుమార్లు బెదిరించేవారు. తన వద్ద ఉన్న రూ.1.50లక్షల నగదును భర్తకు ఇచ్చింది. అనంతరం కూడా వేదింపులు ఆగకపోగా మరింత అధికం అయ్యాయి. అర్థనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. అతడి వేదింపులు రోజు రోజుకు మితిమీరుతుండడంతో భరించలేక ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.