పోలీసుగా నటిస్తూ 6 పెళ్లిలు.. ఏడో పెళ్లికి ముందే అరెస్ట్
Jharkhand man who duped women posing as cop arrested. జార్ఖండ్ రాజధాని రాంచీలో తన గుర్తింపు, మతాన్ని దాచిపెట్టి 6 వివాహాలు చేసుకున్నాడో వ్యక్తి
By అంజి Published on 3 Feb 2023 8:04 AM GMTజార్ఖండ్ రాజధాని రాంచీలో తన గుర్తింపు, మతాన్ని దాచిపెట్టి 6 వివాహాలు చేసుకున్నాడో వ్యక్తి. ఏడవ పెళ్లికి సిద్ధమవుతున్న వేళ.. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 6 పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్లాం అనే 50 ఏళ్ల నిందితుడు ధన్‌బాద్‌లోని భులి నివాసి. అతను పోలీసు అధికారిగా నటిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. అస్లాం ఏడవ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అదే సమయంలో అతని అసలు గుర్తింపు, మతం బయటకు తెలిసింది. విషయం బయటకు పొక్కడంతో సంజయ్ అని పిలిచే అస్లాం ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పోలీసులు అతని కోసం చాలా కాలంగా వెతుకుతున్నారని, అయితే నిందితుడు అరెస్టు నుండి తప్పించుకుంటున్నాడని నగర డీఎస్పీ కుల్దీప్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు రాంచీలో అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న హర్లాలో అస్లాం ఖాన్ మైనర్‌తో సంజయ్ కసేరా వేషం వేసి పెళ్లి చేసుకున్నాడు. పోలీసు అధికారిగా నటిస్తూ, తనతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బెదిరించి, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు అస్లాంపై బాధిత బాలిక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దీంతో పాటు గిరిజన మైనర్, మైనారిటీలను బెదిరించి మతం దాచి 6 పెళ్లిళ్లు చేసుకున్న విషయంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పెళ్లి కోసం అమ్మాయిల ముందు అస్లాం తనను తాను పోలీసు అధికారిగా చెప్పుకునేవాడు. అస్లామ్‌పై రాంచీ, ధన్‌బాద్, తోప్‌చాంచి, చాస్‌లలో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అతని అరెస్టు అనంతరం నగర డీఎస్పీ కుల్దీప్ కుమార్ తెలిపారు. అతనికి నేర చరిత్ర ఉంది. 2021లో ఒక కేసులో జైలుకు కూడా వెళ్ళాడు. తెలిసిన వివరాల ప్రకారం.. నిందితుడు అస్లాం డబ్బు ఎర చూపి హిందూ గిరిజన, ముస్లిం యువతులను పెళ్లి చేసుకునేవాడని తెలిసింది.