రాజలింగమూర్తి హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఏడుగురు అరెస్ట్‌

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ హైకోర్టులో కేసు వేసిన రాజలింగ మూర్తి హత్యకు గురైన విషయం తెలిసిందే.

By అంజి  Published on  23 Feb 2025 1:15 PM IST
Jayashankar Bhupalpally, Arrest, Rajalinga Murthy Murder Case, Telangana

రాజలింగమూర్తి హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఏడుగురు అరెస్ట్‌

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ హైకోర్టులో కేసు వేసిన రాజలింగ మూర్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ హత్య కేసుకు సంబంధించి భూపాలపల్లి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే ప్రకారం.. సంజీవ్, మృతుడి మధ్య కొనసాగుతున్న భూ వివాదం ఫలితంగా ఈ హత్య జరిగింది. హత్యలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.

నిందితుడు నేరానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, రాజలింగ మూర్తిపై కత్తులతో దాడి చేయడానికి ముందు కారం పొడి చల్లాడు. సింగరేణి కాలరీస్ రోడ్డులో కాపు కాసి.. బైక్‌పై వస్తున్న అతడి కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి దారుణంగా చంపేశాడు. ఈ కేసులో అరెస్టయిన వారిని రేణికుంట సంజీవ్, పింగిళి సీమంత్, మోర్ కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసర కృష్ణ, రేణికుంట్ల సాంబయ్యగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు కొత్తూరి హరిబాబు, పుల్లా నరేష్, పుల్లా సురేష్.

Next Story