తిరుపతిలో జనసేన కార్యకర్త దారుణ హత్య
Janasena Activist Brutally Murdered in Tirupati.చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి నగరానికి చెందిన
By తోట వంశీ కుమార్ Published on
30 Jan 2022 6:03 AM GMT

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి నగరానికి చెందిన ఓ జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. గర్తు తెలియని దుండగులు అతడిని కిరాతకంగా హతమార్చారు. స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరుపుతిలోని గాంధీపురంలో సుహానా బాషా తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. కాగా.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద బాషాపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. కత్తులతో అతి కిరాతకంగా హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు, జనసేన కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. బాషాను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story