ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు.

By అంజి  Published on  3 Oct 2023 9:25 AM IST
Jaipur, suicide, Crime news,  marriage

ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు. కిషన్, జ్యోతిగా గుర్తించబడిన ఈ జంట, వారి సంబంధాన్ని వారి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో కిషన్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సోమవారం లోహా మండి ప్రాంతంలోని ఏకాంత ప్రదేశంలో ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడ కిషన్ పదునైన ఆయుధంతో తన గొంతును కోసి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు జ్యోతిని హత్య చేశాడు.

హర్మడ పోలీసు అధికారులు నేరస్థలం వద్ద రక్తపు మడుగులో ఉన్న బాధితులిద్దరూ గుర్తించారు. జ్యోతి అప్పటికే మృతి చెందిందని, కిషన్ పరిస్థితి విషమంగా ఉండటంతో సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిమ్మత్ సింగ్ మాట్లాడుతూ.. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నారని.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా.. వారి కుటుంబాలు అంగీకరించలేదని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story