కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన 44 ఏళ్ల ప్రొఫెసర్ ఉత్తరాఖండ్‌లోని ఒక హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అతని గొంతు కోయబడి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు మైనక్ పాల్ కొన్ని రోజుల క్రితం ఇద్దరు స్నేహితులతో అక్కడకు వచ్చాడు. తత్వశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ అయిన మైనక్ పాల్ రక్తసిక్తమైన మృతదేహం నవంబర్ 8న వాష్‌రూమ్‌లో మెడ, చేతులపై లోతైన కోతలతో పడి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని భార్య, కుమార్తె, తల్లిదండ్రులు.. పాల్ నవంబర్ 8న తిరిగి ఇంటికి వస్తాడని భావించారు. అయితే అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు హోటల్ అధికారులను సంప్రదించారు. వారు అతని గదిలోకి వెళ్లి చూడగా అతని మృతదేహం కనిపించింది.
ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆధారంగా.. ఉత్తరాఖండ్ పోలీసులు ఆత్మహత్యకు గల అవకాశాలను తోసిపుచ్చలేదు. వివరణాత్మక నివేదిక పెండింగ్‌లో ఉంది. జాదవ్‌పూర్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ (JUTA) ఒక సంతాప సందేశంలో.. పాల్‌ను ప్రతిభావంతుడైన వ్యక్తిగా అభివర్ణించింది, అతను ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా గణనీయమైన ప్రభావాన్ని చూపాడు. ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థ ప్రతిమ్ రాయ్ తెలిపారు. కాగా పాల్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.