దారుణం.. రోడ్డు పక్కన మహిళ మృతదేహం.. పాదాలకు ఇనుప మేకులు దిగగొట్టారు

బీహార్‌లోని నలంద జిల్లాలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం అనేక గాయాలు, పాదాలకు మేకులు దిగబడిన స్థితిలో కనిపించింది.

By అంజి
Published on : 7 March 2025 9:58 AM IST

Iron nails driven into feet, woman, Bihar, Crime, Nalanda district

దారుణం.. రోడ్డు పక్కన మహిళ మృతదేహం.. పాదాలకు ఇనుప మేకులు దిగగొట్టారు

బీహార్‌లోని నలంద జిల్లాలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం అనేక గాయాలు, పాదాలకు మేకులు దిగబడిన స్థితిలో కనిపించింది. ఈ సంఘటన చండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో జరిగిందని తెలిసింది. మృతదేహాన్ని కనుగొన్న నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ నైట్ డ్రెస్ ధరించి కనిపించింది. ఆమె శరీరంలో అనేక గాయాలు ఉన్నాయి. ఆమె రెండు పాదాలకు మేకులు దిగగొట్టబడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని బీహార్ షరీఫ్ సదర్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపారు. గుర్తింపు కోసం మార్చురీలో ఉంచారు.

హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. "వ్యక్తిగత శత్రుత్వం, తెలియని దుండగులు సహా అన్ని కోణాల్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాము" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. "పోస్ట్‌మార్టం నివేదిక.. మృతదేహాన్ని గుర్తించడం కేసును ఛేదించడంలో సహాయపడుతుంది." ఈ సంఘటన స్థానికులను కలవరపెట్టింది. ఇలాంటి కేసును తాము ఇంతకు ముందు చూడలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ మహిళను గుర్తించడంలో, బాధ్యులను గుర్తించడంలో సహాయం చేయాలని పోలీసులు ప్రజలను కోరారు. కేసును త్వరలో పరిష్కరిస్తామని, ప్రమేయం ఉన్నవారిని అరెస్టు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Next Story