చైన్నై నుంచి హైదరాబాద్‌ను పెళ్లి వస్త్రాలు తీసుకొస్తున్న ఇద్దరిపై అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. లుంగీలు, ఫాన్సీ ఐటమ్స్ బాక్సుల్లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 10 కోట్ల విలువైన 15 కిలోల ఎపిడ్రిన్ దొరికింది. అంతేకాకుండా ఫేక్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
లుంగీల బాక్సుల్లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి.. వాటిని కొరియర్లో బస్సుల్లో ఎవరికీ అనుమానం రాకుండా సరఫరా చేస్తున్నారు. ఓ కంపెనీకి చెందిన దోతీలు, లుంగీల బాక్సుల్లో పెట్టి వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో బాక్సులో 80 నుంచి, 90 గ్రాముల ప్యాకెట్ పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి హైదరాబాద్, పూణే మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సూడో ఎఫిడ్రిన్ డ్రగ్‌ను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పెళ్లి బట్టల పేరుతో లుంగీలు, ఫాన్సీ వస్త్రాల బాక్సుల్లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి.. వాటిని కాటన్ బాక్సుల్లో పార్సిల్ చేసి కొరియర్ల ద్వారా పంపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.