మహిళలే వారి టార్గెట్.. ఒడిశా నుండి వచ్చారు..!

శ్రీకాకుళం జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు.

By Medi Samrat  Published on  16 Oct 2024 1:33 PM GMT
మహిళలే వారి టార్గెట్.. ఒడిశా నుండి వచ్చారు..!

శ్రీకాకుళం జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన ఈ ముఠా మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడింది. వీరి దగ్గర రూ.6.5 లక్షలకు పైగా విలువ చేసే నగలు దొరికాయి. శ్రీకాకుళం పోలీసు సూపరింటెండెంట్ కె.వి.మహేశ్వర రెడ్డి ఈ గ్యాంగ్ చేసే దారుణాలను వివరించారు. ఈ గ్యాంగ్ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయని తెలిపారు. స్కూటర్లపై లేదా నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తుల బంగారు గొలుసులను లాక్కుని వెళ్లే వారు. ఈ దుండగులు చోరీకి గురైన ఆభరణాలను దాచిపెట్టి, బట్టలు మార్చుకుని వేగంగా పారిపోతూ ఉండేవారు.

చిన్మయ ప్రధాన్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ ముఠా పని చేస్తోంది. మరో ముగ్గురు బిజయ్ ప్రధాన్, సంతోష్ ప్రధాన్, సంజయ్ ప్రధాన్‌లతో కలిసి అక్టోబర్ 1, 2024న వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. బాధితుల నుండి వరుస ఫిర్యాదుల తరువాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఠా నాయకుడు చిన్మయ ప్రధాన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా దొంగతనాలకు పాల్పడింది. ముఠాలోని మిగిలిన వారిని కూడా పట్టుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Next Story