దారుణం: మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik
దారుణం: మత్తుకోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్న ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మత్తు మాత్రలు, ఇంజెక్షన్ లను తీసుకొని ఓ మైనర్ యువకుడు మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. జామ్ జామ్ బేకరీ కి సమీపంలోని గల్లీలో నివాసం ఉంటున్న మహమ్మద్ సాహిల్ అనే వ్యక్తి... మైనర్ బాలురకు మత్తు కలిగిన ఇంజక్షన్లు, టాబ్లెట్లు అమ్ముతున్నట్లుగా సమాచారం.
గత రెండు రోజుల క్రితం సాహిల్ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్దుల్ నాజర్, షబాజ్, హుమానుల్లా ముగ్గురు మైనర్ విద్యార్థులకు ఇంజక్షన్లు విక్రయించినట్లు తెలుస్తుంది. వీటిని ఉపయోగించిన కొద్ది సమయానికి ఈ ముగ్గురు మైనర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే కంగారు పడిన తల్లిదండ్రులు వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అబ్దుల్ నాజర్ (17) దురదృష్టవశాత్తు మృతి చెందాడు.
మరో ఇద్దరు మైనర్ బాలురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. అబ్దుల్ నాజర్ ఎమ్.ఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.