ఏప్రిల్ ఫూల్ ప్రాంక్.. ప్రాణాలే పోయాయి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తన స్నేహితులతో ప్రాంక్ చేయాలని ప్రయత్నించి ఉరి బిగుసుకుపోవడంతో మరణించాడు

By Medi Samrat  Published on  2 April 2024 2:45 PM GMT
ఏప్రిల్ ఫూల్ ప్రాంక్.. ప్రాణాలే పోయాయి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తన స్నేహితులతో ప్రాంక్ చేయాలని ప్రయత్నించి ఉరి బిగుసుకుపోవడంతో మరణించాడు. సోమవారం ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తన స్నేహితులతో వీడియో చాట్ చేస్తూ.. స్టూల్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అభిషేక్ నటించాడు. మెడలో తాడు బిగించి స్టూల్‌పై నిలబడి ఉన్నాడు. తన స్నేహితుడితో చనిపోతున్నానని చెప్పాడు. ఆ సమయంలో స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు.

ఈ సంఘటనను చూసిన వెంటనే.. అభిషేక్ స్నేహితుడు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అభిషేక్ చనిపోయినట్లు ప్రకటించారు. ఇండోర్‌లో 11వ తరగతి విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు.

Next Story