దారుణం : కువైట్‌లో తోటి మ‌హిళ‌ను దారుణంగా హ‌త్య‌చేసిన భారత వ్యక్తి

Indian Woman Murdered In Kuwait. కువైట్‌లో గ్యాస్ సీలిండర్ విషయమై జరిగిన వివాదంలో భారత వ్యక్తి తోటి మహిళను కత్తితో పొడిచి దారుణంగా హ‌త్య‌చేశాడు.

By -  Medi Samrat
Published on : 5 March 2021 9:55 AM IST

Indian Woman Murdered In Kuwait

కువైట్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సీలిండర్ విషయమై జరిగిన వివాదంలో భారత వ్యక్తి తోటి మహిళను కత్తితో పొడిచి దారుణంగా హ‌త్య‌చేశాడు. కువైట్‌లోని అల్ రుమైతియా‌లో ఈ ఘటన జ‌రిగింది. స్థానికంగా ఉండే ఓ భారతీయ కుటుంబంతో సదరు యువకుడు కలిసి ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గ్యాస్ సీలిండర్ విషయమై ఘర్షణ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు.. మహిళను పలుమార్లు కత్తితో పొడిచేశాడు.

యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ.. ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. కాగా, మృతురాలి పేరు, ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Next Story