అనుమానం.. బాలికను నరికి చంపిన తండ్రి, సోదరులు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కౌశాంబి ప్రాంతంలో ఓ టీనేజీ బాలికను అనుమానాస్పదంగా హత్యకు గురైంది.

By అంజి  Published on  27 Aug 2023 6:27 AM IST
Uttar Pradesh, Crime news, honour killing

అనుమానం.. బాలికను నరికి చంపిన తండ్రి, సోదరులు  

అనుమానం పెనుభూతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కౌశాంబి ప్రాంతంలో ఓ టీనేజీ బాలికను అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె తండ్రి, ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి, ఇద్దరు సోదరులు బాలికను శనివారం నాడు అతిక్రూరంగా నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 17 ఏళ్ల యువతి తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ పట్టుబడింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు గొడ్డలితో దాడి చేశారు.

పొరుగువారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాధితురాలికి వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం ఉందని కొంతకాలంగా తండ్రి, సోదరులు అనుమానించారు. కుటుంబ సభ్యులు.. మాట్లాడవద్దని చెప్పినప్పటికీ, అమ్మాయి అబ్బాయితో మాట్లాడటం కొనసాగించింది. కోపంతో తండ్రి, ఇద్దరు సోదరులు బాలిక అతడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో బాలిక తండ్రి, సోదరులు నేరం చేసినట్లు అంగీకరించారు.

Next Story