భార్యపై అనుమానం… యువకుడిని హత్య చేసిన భర్త

In Kerala, a husband killed a young man on suspicion of extramarital affairs against his wife. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో సురేష్‌ కుమార్‌ అనే వ్యక్తి.. ఓ యువకుడిని

By అంజి
Published on : 29 Aug 2022 12:26 PM IST

భార్యపై అనుమానం… యువకుడిని హత్య చేసిన భర్త

తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో సురేష్‌ కుమార్‌ అనే వ్యక్తి.. ఓ యువకుడిని (25) దారుణంగా పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన కొచ్చిలోని నెట్టూరులో జరిగింది. నిందితుడు సురేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడిని అజయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. పాలక్కాడ్‌లోని పిరాయిరికి చెందిన అజయ్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అజయ్‌కు, సురేష్‌ భార్యతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆగస్టు 27న అజయ్‌ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేష్ భార్యను కలిసేందుకు కొచ్చి వచ్చాడు. ఆమె అడిగిన డబ్బులను అజయ్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత అజయ్‌ ఉంటున్న హోటల్‌కు భార్య వెళ్లిన విషయం గురించి సురేష్‌కు తెలిపింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని సురేష్‌ అనుమానించాడు. ఆ రోజు రాత్రి భార్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లిన సురేష్‌.. భార్యను కారులో వెంటబెట్టుకుని అజయ్‌ బస్త చేస్తున్న హోటల్‌కు వెళ్లాడు. భార్యను కారులో ఉంచి అజయ్‌ ఉంటున్న హోటల్‌ రూమ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే వారిద్దరి సంబంధంపై సురేష్ ఘర్షణకు దిగాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా అజయ్‌పై సురేష్‌ వీల్‌ స్పానర్‌తో మోదాడు.

స్పృహ కోల్పోయే వరకు సురేష్ అజయ్‌పై దాడి చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అజయ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో అజయ్‌ను హత్య చేసిన సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story