జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. ప్రియుడిపై ప్రియురాలు విషప్రయోగం.. చివరకు

In Kerala, a girlfriend killed her boyfriend by believing the words of an astrologer. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ యువతి విషం జ్యూస్‌ తాగించి తన ప్రియుడిని హతమార్చిన దారుణ ఘటన

By అంజి  Published on  31 Oct 2022 10:00 AM IST
జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. ప్రియుడిపై ప్రియురాలు విషప్రయోగం.. చివరకు

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కేరళలోని పతంతిట్ట జిల్లాలో నరబలి కేసు మరువక ముందే.. తిరువనంతపురంలోని పరశాలలో మరో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఓ యువతి విషం జ్యూస్‌ తాగించి తన ప్రియుడిని హతమార్చిన దారుణ ఘటన వెలుగు చూసింది. హత్యకు గురైన ప్రేమికుడు షారోన్ కాగా, ప్రేమికుడిని హత్య చేసిన నిందితురాలు గ్రీష్మ. వీరిద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఓ భారత సైన్యంలో పని చేస్తన్న వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించారు.

కానీ ఆ యువకుడికి ఆ ప్రియురాలిని దూరం చేసుకోవడం ఇష్టం లేదు. ఇదిలా ఉండగా నవంబరులోపు పెళ్లి చేసుకుంటే ప్రియుడు చనిపోతాడని ఓ జ్యోతిష్యుడు యువతికి చెప్పాడ. ఈ విషయాన్ని యువతి తన ప్రియుడి దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆమెను వదులుకోవడానికి యువకుడు అంగీకరించలేదు. అందుకే జ్యోతిష్యుడు చెప్పిన మూఢ నమ్మకాలను నమ్మి యువతి తన ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత నెల 14న తమిళనాడులోని రామవర్మంచిరలో ఉన్న యువతి ఇంటికి షారోన్ వెళ్లాడు. అక్కడ వారు జ్యూస్‌ తాగే పోటీ పెట్టుకున్నారు.

యువతి కాపర్ సల్ఫేట్ కలిపిన రసాన్ని ఇచ్చింది. అలాగే యువతితో కలిసి బయటకు వెళ్లిన ప్రతిసారీ షారన్‌కు కడుపునొప్పి వస్తోందని చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు షారోన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషం తాగినందువల్లే షారోన్‌ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ విధంగా పోలీసులు నిందితుడు గ్రీష్మను ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. అలాగే ఇందుకు నిదర్శనంగా వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ లు కూడా వెలుగులోకి రావడంతో.. జ్యూస్ ఛాలెంజ్ పేరుతో షరాన్ కోసం గ్రీష్మా జ్యూస్ తాగించిన సంగతి తెలిసిందే. అందుకే నిత్యం విషప్రయోగం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు.

Next Story