ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పాతబస్తీలో మాజిద్ అట్టర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుపుర్ శర్మ ఘటనపై అట్టర్.. ఫేసుబుక్‌లో పోస్ట్ పెట్టడం కలకలం సృష్టించింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్ డిమాండ్ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు. మొఘల్‌పురా పోలీసులు మాజిద్ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. నోవాటెల్, పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు.