Hyderabad: మహిళ దారుణ హత్య.. గోనె సంచిలో మృతదేహాం

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగర శివార్లలోని పహాడీషరీఫ్‌లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని

By అంజి  Published on  12 April 2023 1:15 PM IST
Dead Body, Hyderabad, Tukkuguda, Crime news

Hyderabad: మహిళ దారుణ హత్య.. గోనె సంచిలో మృతదేహాం 

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగర శివార్లలోని పహాడీషరీఫ్‌లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేసి గోనె సంచిలో శవాన్ని పారవేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని హార్డ్‌వేర్ పార్క్ సమీపంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని స్థానికులు గమనించారు. ఆ వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళను టవల్‌తో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రత్యేక ప్రదేశంలో పడేశారు.

''మహిళ మూడు రోజుల క్రితం హత్య చేయబడి ఉండవచ్చు. శరీరం బాగా కుళ్లిపోయింది. మహిళను గుర్తించి హంతకుల జాడ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం'' అని మహేశ్వరం ఏసీపీ సీ అంజయ్య తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆ మృతదేహం ఎవరిది?, మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది?, ఎవరు హత్య చేశారు? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Next Story