Hyderabad: భోజనం బాగోలేదని.. భార్యను చంపిన భర్త

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రగతి కన్‌స్ట్రక్షన్స్‌లో మంగళవారం నాడు మహిళను ఆమె భర్త హత్య చేశాడు.

By అంజి
Published on : 30 April 2024 12:47 PM IST

Hyderabad, Woman killed by husband, Bachupally, Crime

Hyderabad: భోజనం బాగోలేదని.. భార్యను చంపిన భర్త 

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని ప్రగతి కన్‌స్ట్రక్షన్స్‌లో మంగళవారం నాడు మహిళను ఆమె భర్త హత్య చేశాడు. మధ్య ప్రదేశ్ కు చెందిన భార్య భర్తలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాధితురాలు రవీనా దూబే (26), ఆమె భర్త శ్యామ్ దూబే కొన్ని రోజులుగా చిన్న విషయాలపై తరచూ గొడవ పడుతున్నారు.

కాగా తాజాగా భోజనం బాగోలేదని భార్యను.. భర్త ఇటుకతో కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో భార్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Next Story