సీరియల్ నటుడు చందు సూసైడ్.. నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక..
బుల్లితెర నటుడు చందు (40) శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'త్రినయని'తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న చందు సూసైడ్ కలకలం రేపింది.
By అంజి Published on 18 May 2024 6:15 AM ISTసీరియల్ నటుడు చందు సూసైడ్.. నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక..
బుల్లితెర నటుడు చందు (40) శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'త్రినయని'తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న చందు సూసైడ్ కలకలం రేపింది. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. 4 రోజుల క్రితం 'త్రినయని' సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఈ ఘటనలో చంద్రకాంత్‌కు గాయాలయ్యాయి.
పవిత్ర జయరాం మృతితో మానసికంగా కుంగిపోయిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు వచ్చి చూసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందు ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. చందు మరణవార్తతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
నిన్న పవిత్ర పుట్టినరోజు.. పవిత్ర రమ్మంటుంది అంటూ చందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు ఓ యూట్యూబ్ చానెల్‌లో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని వెల్లడించాడు. చందుకు 2015 లోనే శిల్పా అనే యువతి వివాహం అయింది. ''ఈరోజు పవిత్ర పుట్టినరోజు..నిన్ను మర్చిపోలేక పోతున్నా.. మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. జిమ్ వెళ్దాం అని'' చందు పోస్ట్‌లు పెట్టాడు. పవిత్రతో గత కొంతకాలం నుంచి చందు సహజీవనం చేస్తున్నాడని సమాచారం.