హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీ కలకలం.. 9 మంది అరెస్ట్‌.. పరారీలో ఇద్దరు

హైదరాబాద్ నగరంలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్ లో ఉన్న ఓ విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు.

By అంజి
Published on : 27 July 2025 12:32 PM IST

Hyderabad, Rave party busted, Kondapur, nine arrested, drugs, two absconding

హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీ కలకలం.. 9 మంది అరెస్ట్‌.. పరారీలో ఇద్దరు

హైదరాబాద్ నగరంలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్ లో ఉన్న ఓ విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. టాస్క్ ఫోర్స్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శనివారం రాత్రి కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీపై దాడి చేసి , మాదకద్రవ్యాలు సేవిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసింది.

పోలీసులు 2.08 కిలోగ్రాముల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్‌, 1.91 గ్రాముల చెరస్, 4 ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో రాహుల్, ఉన్నతి ఇమ్మాన్యుయేలా అలియాస్ ప్రవీణ్, అశోక్ నాయుడు, సమ్మెల సాయికృష్ణ, నాగెళ్ల లీలా మణికంఠ, హిల్టన్ జోసెఫ్, యశ్వంత్ శ్రీదత్తా, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజ ఉన్నారు. మరో ఇద్దరు శ్రీనివాస్ చౌదరి, అఖిల్ పరారీలో ఉన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను సేకరిస్తున్నాడని, ప్రవీణ్ తన సహచరుల ద్వారా ఇతరులకు సరఫరా చేస్తున్నాడని తేలింది. ఈ రేవ్ పార్టీని అశోక్ నాయుడు నిర్వహించాడు. మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్న మిగిలిన అనుమానితులు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. కొండాపూర్‌లోని ఎస్వీ నిలయంలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో దీనిని నిర్వహించారు. అరెస్టయిన వారందరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.

Next Story