హైదరాబాద్‌లో సంచలనం.. మహిళపై గ్యాంగ్‌రేప్‌.. మర్మాంగంలో కర్రలు చొప్పించి చంపేశారు

రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో దారుణ హత్యకు గురైన యాకత్‌పూరా కు చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు.

By -  అంజి
Published on : 23 Sept 2025 7:18 AM IST

Hyderabad, Police, brutal murder, Rajendranagar, Crime

హైదరాబాద్‌లో సంచలనం.. మహిళపై గ్యాంగ్‌రేప్‌.. మర్మాంగంలో కర్రలు చొప్పించి చంపేశారు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో దారుణ హత్యకు గురైన యాకత్‌పూరా కు చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. టోలీచౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు.. మహిళపై అత్యాచారం చేసి అపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదర్‌గూడ వద్ద ఫుల్‌గా కల్లు తాగి సృహ కోల్పోయిన మహిళను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆటోలో కిడ్నాప్‌ చేశారు. ఆదివారం రాత్రి మహిళను రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకోని వచ్చి ఫుల్ గా మద్యం సేవించారు.

ఆ తర్వాత మహిళ పై ఒకరి తరువాత మరోకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మహిళపై దాడి చేశారు. తమకు సరయైన రీతిలో సహరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించారు. మహిళను పూర్తిగా వివస్త్రను చేసి ఆమె మర్మాంగంలో కర్రలు గుచ్చి అత్యంత క్రూరంగా హత్య చేశారు. బాధితురాలు చనిపోవడంతో.. మృతదేహాన్ని అక్కడే పడేసి హంతకులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదు రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్నారు. నాంపల్లి నుండి రాజేంద్రనగర్ హైదర్ గూడా వరకు ఉన్న అన్ని సిసి టీవి ఫూటేజ్ లను పరిశీలించి రాజేంద్రనగర్‌ ఎస్ఓటీ టీమ్‌.. నిందితులను పట్టుకుంది.

ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకత్ పూరా నుండి హైదర్ గూడా కు వచ్చిన వివాహిత.. హైదర్ గూడా కళ్లు కంపౌండ్ లో ఫుల్ గా కల్లు సేవించింది. అదే మత్తులో బయటకు వచ్చిన మహిళ రోడ్డు పై పడి పోయింది. అదే సమయంలో కల్లు కంపౌండ్ కు వచ్చిన టౌలీచౌకికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్.. మహిళ కదలికలు గమనించి ఆమెపై కన్నేశారు. మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకు వెళ్లి ఒకరి తరువాత అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు.

Next Story