Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

హైదరాబాద్‌: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు.

By అంజి  Published on  18 July 2024 12:24 PM IST
Hyderabad, Police, arrest, wedding baraat

Hyderabad: బారాత్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో.. 

హైదరాబాద్‌: పెళ్లి బారాత్‌లో ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఆనందోత్సాహాలతో ఆ యువకుడు చేసిన డ్యాన్స్‌ను అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు వీడియో తీశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కట్ చేస్తే పోలీసులు ఆ యువకుడిని జైల్లో వేశారు. పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ పెళ్లి బారాత్ వేడుకల్లో యువకుడు చేతిలో కత్తి పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించి పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.

సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో ఈనెల 5వ తేదీన జరిగిన వివాహ బారాత్‌లో అబ్దుల్ రహీం అనే యువకుడు సంతోషంతో కత్తులు పట్టుకొని డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను ఆధారంగా చేసుకుని పోలీసులు ఆ యువకుడిపై సెక్షన్ 24(1)A ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసు నమోదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి కత్తి స్వాధీనం చేసుకున్నారు.

Next Story