హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన గంజాయి లేడీ డాన్..ఒడిశాలో అరెస్ట్

ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

By Knakam Karthik
Published on : 26 March 2025 6:57 PM IST

Crime News, Hyderanbad, Ganja Lady Don Sangita Sahu, Hyderabad Police

హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన గంజాయి లేడీ డాన్..ఒడిశాలో అరెస్ట్

ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సరఫరా కేసుల్లో నిందితురాలిగా సాహును ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఒడిశా వెళ్లిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు, అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు.

సంగీత సాహు ఒడిశాలోని కుర్ధా జిల్లా, కాళీకోట్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆమె దాదాపు నాలుగేళ్ల క్రితం గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించింది. వివిధ రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో సంబంధాలు నెరుపుతూ, వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో హైదరాబాద్‌లోని దూల్‌పేటలో ఇద్దరు వ్యక్తులకు 41.3 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడింది. దూల్‌పేటలో పలువురికి ఆమె గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సంగీత సాహు ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ నటిలా వీడియోలు పోస్టు చేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

Next Story