Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలో జరిగింది.

By అంజి  Published on  7 Jun 2024 2:13 PM IST
Hyderabad, Crime, cops,  Lalapet

Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి 

హైదరాబాద్‌: పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలోని లాలాపేటలో గురువారంరాత్రి జరిగింది. వినయ్ కుమార్ (36) అతని స్నేహితులు భవనం వద్ద పేకాట ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. అదే పరిసరాల్లో నివసించే టాస్క్‌ఫోర్స్ అధికారి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్నాడు. ప్రాంగణంలో దాడి చేయడానికి అతని బృందాన్ని అప్రమత్తం చేశాడు. అయితే, బృందం రాకముందే, అధికారి భవనం వద్దకు చేరుకుని, దాని ప్రవేశ ద్వారం వద్ద నిలబడి, కాపలాగా, వారు తప్పించుకోకుండా నిరోధించాడు.

గది నుంచి బయటకు వచ్చిన వినయ్ స్నేహితుల్లో ఒకరు ప్రవేశద్వారం వద్ద ఉన్న అధికారిని చూసి అతని స్నేహితులను అప్రమత్తం చేశాడు. అరెస్టు భయంతో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో, వినయ్ మొదటి అంతస్తు నుండి దూకి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, వినయ్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి మృతి చెందినట్లు వినయ్ కుటుంబీకులు తెలిపినట్లు లాలాగూడ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story