హైదరాబాద్‌లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వయసు మీద పడుతున్నా పెళ్లి అవ్వడం లేదని బాధతో 32 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని పి. ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు. శంషాబాద్ లోని పెద్దతుప్రా గ్రామానికి చెందినవాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా, అతని కుటుంబం వధువు కోసం వెతుకుతోంది. కానీ పెళ్లి మాత్రం ఫిక్స్ అవ్వలేదు. దీంతో ప్రవీణ్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.
ప్రవీణ్ తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు కేసు నమోదు చేసి ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.