సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. చేరియాల్‌గుట్ట దగ్గర అతివేగంతో ఫిల్మ్‌నగర్ ఎస్‌ఐ కారు నడుపుతూ వెళ్లి లారీని వెనుక నుంచి డీకొట్టాడు. దీంతో ఎస్‌ఐకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఎస్‌ఐ రాజేశ్వర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
కాగా మృతుడు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో ఎస్‌ఐ రాజేశ్వర్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారం రోజుల క్రితమే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు.