Hyderabad: దారుణం.. శవమై కనిపించిన మాజీ ఎంపీటీసీ మహేష్‌

వారం రోజుల క్రితం అదృశ్యమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) మాజీ సభ్యుడు జూన్ 24 సోమవారం ఘట్‌కేసర్‌లో శవమై కనిపించాడు.

By అంజి
Published on : 24 Jun 2024 8:33 PM IST

Hyderabad, Ex MPTC, member, Ghatkesar, Crime

Hyderabad: దారుణం.. శవమై కనిపించిన మాజీ ఎంపీటీసీ మహేష్‌

హైదరాబాద్: వారం రోజుల క్రితం అదృశ్యమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) మాజీ సభ్యుడు జూన్ 24 సోమవారం ఘట్‌కేసర్‌లో శవమై కనిపించాడు. బాధితుడిని మహేశ్ (42)గా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహేశ్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తదుపరి విచారణలో.. పోలీసులు చిన్నా, పరమేష్‌లను పట్టుకున్నారు.

వారు మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని, కారును డంపింగ్ గ్రౌండ్‌లో పారవేసారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలను గుర్తించేందుకు శవపరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. హత్య వెనుక ఉద్దేశ్యం అస్పష్టంగానే ఉంది, అయితే ఊహాగానాలు వివాహేతర సంబంధాన్ని సూచిస్తున్నాయి. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story