Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

By అంజి
Published on : 23 Aug 2024 8:17 AM IST

Hyderabad, Telangana, Engineering student, murder, Balapur, dispute

Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒక హత్య మరవకముందే మరొక హత్య జరుగుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. నలుగురి మధ్య తలెత్తిన వివాదం కారణంగా మృతుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 22వ తేదీ గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొండ్రు ప్రశాంత్‌ (21)గా గుర్తించారు. మండి 37 హోటల్ సమీపంలోని పాన్ షాప్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. దాడిలో ముగ్గురు దుండగులు ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story