మహిళా వైద్యురాలిపై వైద్యుడు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని హోటల్‌కు తీసుకెళ్లి..

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. మహిళా వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

By అంజి
Published on : 21 May 2025 11:43 AM IST

Hyderabad,Doctor, Crime, Banjarahills PS

మహిళా వైద్యురాలిపై వైద్యుడు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని హోటల్‌కు తీసుకెళ్లి..

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. మహిళా వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న బాధితురాలికి.. మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ స్వామితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో డాక్టర్ స్వామి మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

పెళ్లి పేరుతో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. అయితే జనవరి నెలలో డాక్టర్ స్వామి మహిళా వైద్యురాలిని ఓ హోటల్‌కు రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన మహిళా డాక్టర్ పై డాక్టర్ స్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళా డాక్టర్ తనను పెళ్లి చేసుకోమని డాక్టర్ స్వామిని అడిగింది. అప్పటి నుండి డాక్టర్ స్వామి పెళ్లికి నిరాకరిస్తూ వస్తున్నాడు. డాక్టర్ స్వామి పెళ్లికి నిరాకరిస్తూ ఉండడంతో సదరు మహిళ వైద్యురాలు బంజరాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story