హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు రాత్రి గోపీనగర్‌లోని గోపీ చెరువు సమీపంలో మద్యం మత్తులో గొడవ తర్వాత 35 ఏళ్ల వ్యక్తిని అతని సన్నిహితుడు హత్య చేశాడని చందానగర్ ఇన్‌స్పెక్టర్ దొగ్గ పాలవెల్లి తెలిపారు. మొహమ్మద్ ఫక్రుద్దీన్.. అతని స్నేహితుడు మొహమ్మద్ నజీర్‌ను కత్తితో పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. నజీర్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుని మృతి
ఇదిలా ఉంటే.. ప్రగతినగర్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మల్లికార్జున్ (26) ఆత్మహత్య చేసుకున్నట్లు కెపిహెచ్‌బి పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలుకు చెందిన మల్లికార్జున్ వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ లింగం తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
టీచర్ తిట్టడంతో విద్యార్థి ఆత్మహత్య
న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్‌లో 15 ఏళ్ల విద్యార్థి తన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తరగతి ముందు తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఉప్పల్ పోలీసులు శనివారం తెలిపారు.
కుషాయిగూడ బస్టాప్‌లో తండ్రిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
కుషాయిగూడ బస్ స్టాప్‌లో శనివారం ఒక వ్యక్తి తన 47 ఏళ్ల తండ్రిని ప్రజల సమక్షంలోనే కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నుండి కొన్ని మీటర్ల దూరంలో జరిగింది. బాధితుడిని మోగి (47) గా, దాడి చేసిన వ్యక్తిని అతని కుమారుడు సాయి కుమార్ (25) గా గుర్తించారు, వీరు లాలాపేటకు చెందినవారు. వారు వేర్వేరు ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నారు.