హైదరాబాద్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి

హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

By Knakam Karthik  Published on  22 Feb 2025 1:35 PM IST
Crime News, Hyderabad, Nampally, Boy  Died

హైదరాబాద్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి

హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాంపల్లిలోని శాంతినగర్ ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌కు, గోడకి మధ్య ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నాంపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రెడీల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిఫ్ట్‌లో బాలుడు ఇరుక్కుపోయాడు. రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

అర్ణవ్ (06) లిఫ్టులో కిందికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్‌కు, స్లాబ్‌కు మధ్య ఇరుక్కుపోయాడు.. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరకు లిఫ్ట్ డోర్‌కు, గోడకు మధ్య ఉన్న స్థలంలో ఇరుక్కుపోయిన అర్ణవ్‌ను బయటకు తీసి నీలోఫర్ హాస్పిటల్‌కు తలరించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగానే బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story