Hyderabad: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

ఒకవైపు స్మార్ట్ ఫోన్ల కారణంగా యువత తప్పుదోవ పడుతుండగా... మరోవైపు తల్లిదండ్రులు పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

By అంజి  Published on  18 Sept 2024 12:26 PM IST
Hyderabad, Crime, Ramachandrapuram

Hyderabad: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

ఒకవైపు స్మార్ట్ ఫోన్ల కారణంగా యువత తప్పుదోవ పడుతుండగా... మరోవైపు తల్లిదండ్రులు పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతికి ఫోన్ ఇచ్చి వారు ఏం చేస్తున్నారో గమనించ కుండా వదిలేస్తున్నారు.. ఫలితంగా అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. వావివరసలు మరిచి కామంతో కళ్ళు మూసుకుని పోయి చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువకుడి కన్ను పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారిపై పడింది. దీంతో అవకాశం కోసం ఎదురు చూశాడు. అయితే నిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి (7) ని టీవీ చూద్దామని పిలిచాడు. చిన్నారిని యువకుడు (18) ఇంట్లోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యింది. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు ఫైల్ చేసి యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Next Story