Hyderabad: బైక్‌ లిఫ్ట్‌ అడిగింది.. దుస్తులు విప్పేస్తానని బెదిరించి రూ. 25 వేలు దోచింది

బైకర్‌ని లిఫ్ట్‌ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది.

By అంజి  Published on  26 Dec 2023 3:15 AM GMT
Hyderabad, extorted money, Banjarahills, Crime news

Hyderabad: బైక్‌ లిఫ్ట్‌ అడిగింది.. దుస్తులు విప్పేస్తానని బెదిరించి రూ. 25 వేలు దోచింది

బైకర్‌ని లిఫ్ట్‌ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. కిలేడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో 45 ఏళ్ల బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేటకు చెందిన గుత్తి జంగయ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట్‌ నుంచి గచ్చిబౌలికి బైక్‌పై వెళ్తున్నాడు. బంజారాహిల్స్‌లోని ఎస్‌ఎన్‌టి సిగ్నల్‌ దగ్గర మాస్కు పెట్టుకున్న 35 ఏళ్ల మహిళ అతన్ని లిఫ్టు అడిగింది. దానికి అతడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ముగ్ధా సిగ్నల్ దగ్గర పరిస్థితి భయానక మలుపు తిరిగింది. బైక్‌పై ఎక్కించుకొని వెళ్తుండగా తన గదికి రావాలంటూ కోరింది.

ముగ్ధ సిగ్నల్‌ వద్ద బైక్‌ని నిలపాలని కోరింది. బైక్‌ను నిలపగానే తనకు డబ్బులు కావాలంది. ఆమె అతని ఫోన్ తీసుకొని మరింత డబ్బు డిమాండ్ చేయడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో అతను భయపడి ఏటీఎంలో నుంచి రూ.25 వేలు డ్రా చేసి ఇచ్చాడు. మరిన్ని డబ్బులు కావాలంటూ బైక్‌ కీస్‌ని లాక్కుంది. డబ్బులు ఇవ్వకుంటే తన ఒంటి మీద దుస్తులను విప్పేసి గొడవ పెడుతానంటూ బెదిరింపులకు దిగింది. ఇంకా తన దగ్గర డబ్బులు లేవంటే లేవనడంతో ఎస్‌ఎన్‌టీ కూడలి వద్ద వదిలేయాలంది. అతను అలాగే ఆమెను తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు గుర్తు తెలియని మహిళపై ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story