హైదరాబాద్: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'సూక్ష్మదర్శిని' వెబ్ సిరీస్ స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్టు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్టే గురుమూర్తి కూడా మాయం చేశాడు.
సూక్ష్మ దర్శిని సినిమాలో తరహా మృతదేహాన్ని గురుమూర్తి డిస్పోస్ చేశాడు. కెమికల్స్‌లో నానబెట్టి మృతదేహాన్ని పొడిగా మార్చాడు. అనంతరం మాధవి మృత దేహం ఎముకల పొడిని చెరువులో చల్లాడు. క్లూస్ టీమ్ బ్లూ రేస్ టెక్నాలజీ తో ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించారు.ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్ తో పాటు క్లూస్ టీం ఆధారాల నివేదిక వచ్చే అవకాశం ఉంది. సాయంత్రంలోగా గురుమూర్తి పైన యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.