Hyderabad: భార్యను కిరాతకంగా చంపిన భర్త.. నిద్రలో ఉండగానే..
హైదరాబాద్: నగరంలోని హైదర్ షాకోట్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 8 Oct 2024 9:48 AM ISTHyderabad: భార్యను కిరాతకంగా చంపిన భర్త.. నిద్రలో ఉండగానే..
హైదరాబాద్: నగరంలోని హైదర్ షాకోట్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్, తన భార్య, వైష్ణవి, ఉదయ్ అనే ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా శ్రీనివాస్ తన భార్యను టార్చర్ చేస్తున్నాడు. దీంతో భార్య పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే విసుగు చెందిన శ్రీనివాస్ భార్యను ప్రతినిత్యం టార్చర్ చేసేవాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్యపై ఒక్క సారిగా సుత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
భార్యను చంపిన అనంతరం శ్రీనివాస్ తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తన భార్యను హత్య చేశానని శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. హుటా హుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి దారుణం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.