Hyderabad: లవ్‌ ఎఫైర్‌.. యువకుడిని కొట్టి చంపిన బాలిక తల్లిదండ్రులు

మైనర్ బాలికతో ప్రేమ సంబంధం పెట్టుకున్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు, బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

By అంజి  Published on  10 Nov 2023 7:13 AM IST
Hyderabad, love affair, Crime news

Hyderabad: లవ్‌ ఎఫైర్‌.. యువకుడిని కొట్టి చంపిన బాలిక తల్లిదండ్రులు 

హైదరాబాద్: మైనర్ బాలికతో ప్రేమ సంబంధం పెట్టుకున్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు, బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కిరణ్ (18) తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని యువకుడిని పట్టుకుని కొట్టారు. బాలిక బంధువులు యువకుడి ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పోసి దాడి చేశారు. దాదాపు గంటసేపు దాడి చేయడంతో యువకుడు మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితుడి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

బాధితుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ అమ్మాయితో కొంతకాలంగా ప్రేమాయణం సాగించాడు. ఆమె తల్లిదండ్రులు గతంలో వారిద్దరినీ హెచ్చరించి, తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పారు. అయితే ఆ అబ్బాయి ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. బుధవారం రాత్రి, బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో, యువకుడు ఆమె ఇంటికి వెళ్లగా, కొంతమంది ఇరుగుపొరుగు వారు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపారు.

Next Story