12 సంవత్సరాలుగా భార్యను బంధించిన భర్త.. చివరికి?
కర్ణాటకలోని మైసూరులో భర్త చేతిలో భార్య ఎంతో టార్చర్ ను అనుభవించింది. 12 ఏళ్లుగా ఆమెను ఓ ఇంట్లో బంధించాడు.
By Medi Samrat Published on 2 Feb 2024 7:19 PM ISTకర్ణాటకలోని మైసూరులో భర్త చేతిలో భార్య ఎంతో టార్చర్ ను అనుభవించింది. 12 ఏళ్లుగా ఆమెను ఓ ఇంట్లో బంధించాడు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను రక్షించారు. అయితే భార్య భర్తపై కేసు పెట్టడానికి నిరాకరించింది. తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్న మహిళ, తన భర్త తనను 12 సంవత్సరాలుగా ఇంటి లోపల బంధించి ఉంచాడని తెలిపింది. మరుగుదొడ్డి సదుపాయం కూడా ఉండేది కాదని.. ఇంట్లోనే చిన్న బాక్స్‌ను ఉపయోగించానని చెప్పింది.
భర్త పని నుండి తిరిగి వచ్చే వరకు ఆ దంపతుల ఇద్దరు పిల్లలు ఇంటి వెలుపల వేచి ఉండేవారు. అతడు వచ్చి తలుపులు తెరచిన వెంటనే వారిని లోపలికి అనుమతించేవాడట. "నాకు పెళ్లయి 12 సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడూ ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేసేవాడు. నన్ను.. ఆ ప్రాంతంలో ఎవరూ మాట్లాడేవారు కాదు... నా పిల్లలు పాఠశాలకు వెళతారు. కానీ నా భర్త పని నుండి తిరిగి వచ్చే వరకు వారు బయటే ఉంటారు. నేను వారికి కిటికీలోంచి ఆహారం ఇస్తాను" అని ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఆమె భర్త ఆమెను ఎక్కడకూ వెళ్లనిచ్చేవాడు కాదు. ఆమె గతంలో తన తల్లిదండ్రుల ఇంటికి వెల్తూ ఉండేది.. భర్త ఉద్యోగానికి వెళ్లే ముందు ఆమెను ఇంటిలోపల తాళం వేసి ఉంచేవాడట. అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఆమె మూడవ భార్య.. రక్షించిన తర్వాత మహిళకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె తన భర్తపై ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.