హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి మూటగట్టి పడేసిన భర్త
Husband kills his wife in KPHB.హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.భార్యను చంపి మూటగట్టి పడేసిన భర్త
By తోట వంశీ కుమార్ Published on
6 Jan 2021 5:59 AM GMT

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపిన ఓ భర్త.. ఆమె మృతదేహాన్ని మూట కట్టి పడేసి పరారయ్యాడు. కేపీహెచ్‌బీ పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో శేఖర్, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్రవంతి తలపై కొట్టి చున్నీతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు శేఖర్.
అనంతరం మృతదేహాన్ని మూటలో కట్టి.. తాము ఉంటున్న భవనం పక్కన ఖాళీ ప్రదేశంలో పడేసి పరారయ్యాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో.. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మూటను పరిశీలించగా.. అందులో స్రవంతి మృతదేహాం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story