భార్యను చంపేశాడు.. గుట్టుగా మృత‌దేహాన్ని త‌ర‌లిస్తూ దొరికిపోయాడు..!

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం భార్య ప్రాణాల మీదకు తెచ్చింది

By Kalasani Durgapraveen  Published on  8 Nov 2024 12:27 PM IST
భార్యను చంపేశాడు.. గుట్టుగా మృత‌దేహాన్ని త‌ర‌లిస్తూ దొరికిపోయాడు..!

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. భర్తకు చెప్పకుండా కూతురికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిందని కారణంతో భార్యను హత్య చేశాడు భర్త. వివ‌రాళ్లోకెళితే.. వేమూరి వెంకటేశ్వరరావు (72), వేమూరి జయమ్మ (67) భార్య భర్తలు. భర్తకు చెప్పకుండా గ్యాస్ సిలిండర్ కూతురికిచ్చిందని జయమ్మపై వెంకటేశ్వరరావు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య తలను మంచంకోడుకు గట్టిగా కొట్టడంతో జయమ్మ అక్క‌డిక్క‌డే మృతి చెందింది.

దీంతో భార్య మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాల‌నుకున్నాడు వెంకటేశ్వరరావు. వెంట‌నే భార్య‌ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకుని ఊరు పక్కన ఉన్న రైల్వే పట్టాలపై వేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే.. మృతదేహాన్ని తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్తులకు అనుమానం వచ్చి నిలదీయడంతో మృతదేహాన్ని వదిలి వెంకటేశ్వరరావు పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story