దారుణం.. కూర‌లో ఉప్పు త‌క్కువైంద‌ని.. భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Husband Killed wife due to less Salt in Curry.క్ష‌ణికావేశంలో కొంద‌రు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2022 11:33 AM IST
దారుణం.. కూర‌లో ఉప్పు త‌క్కువైంద‌ని.. భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

క్ష‌ణికావేశంలో కొంద‌రు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. కూర‌లో ఉప్పు త‌క్కువైంద‌ని ఓ భ‌ర్త క‌ట్టుకున్న భార్య‌నే దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. సారన్‌ జిల్లా క‌లాన్ గ్రామంలో 55 ఏళ్ల ప్ర‌భురామ్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. తాటిచెట్టు నుంచి కల్లు తీసి అమ్ముకోని ప్ర‌భురామ్ త‌న కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్ర‌వారం రాత్రి భోజ‌నానికి కూర్చుకున్నాడు. ప్ర‌భురామ్ భార్య‌(50) అత‌డికి ఆహారాన్ని వ‌డ్డించింది. అయితే.. కూర‌లో ఉప్పు త‌క్కువైంద‌ని భార్య‌తో గొడ‌వ‌కు దిగాడు. చిన్న‌గా మొద‌లైన గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారింది.

ఈ క్ర‌మంలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ప్ర‌భురామ్ ప‌దునైన ఆయుధంతో భార్య‌పై దాడి చేశాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్నిప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story