ప్రేమ‌పెళ్లి.. భార్య వేలు క‌ట్‌చేసి పారిపోయిన భ‌ర్త‌

Husband cuts his wife finger.ఫేస్‌బుక్‌లో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 1:26 PM IST
ప్రేమ‌పెళ్లి.. భార్య వేలు క‌ట్‌చేసి పారిపోయిన భ‌ర్త‌

ఫేస్‌బుక్‌లో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. కోరుకున్న వాడితో త‌న జీవితం ఆనందంగా ఉంటుంద‌ని ఆ యువ‌తి ఎంతో ఆశ‌తో రాగా.. యువ‌కుడి అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. ఏ ప‌ని చేయ‌కుండా నిత్యం వేదించేవాడు. అయినా స‌ర్దుకుపోతు జీవితాన్ని నెట్టుకొస్తుంది. అయితే.. ఇటీవ‌ల తీవ్రంగా కొట్ట‌డంతో పాటు వేలుని క‌త్తిరించాడు. అనంత‌రం చంపేస్తాన‌ని బెదిరించ‌డంతో భార్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన హసి (22) అనే యువతికి జూబ్లీహిల్స్‌ వెంకటగిరికి చెందిన రవి నాయక్ తో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్తా.. ప్రేమ‌గా మారింది. ఇటీవ‌ల ర‌వినాయ‌క్‌.. హ‌సిని వివాహం చేసుకుని న‌గ‌రానికి తీసుకువ‌చ్చాడు. ఆమె బ్యూటీషియ‌న్‌గా ప‌నిచేస్తుండ‌గా.. ర‌వినాయ‌క్ ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల ప‌దో తేదిన త‌న‌కు రూ.50 వేలు కావాల‌ని ర‌వి నాయ‌క్ భార్య హ‌సిని అడుగ‌గా.. లేవు అన‌డంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంత‌రం ఆమె చేతి వేలిని క‌ట్ చేసి అక్క‌డి నుంచి పారిపోయాడు. మ‌రుస‌టి రోజు ఫోన్ చేసి న‌గ‌దు ఇవ్వ‌కుంటే చంపేస్తాన‌ని బెదిరించాడు. దీంతో ఆందోళ‌న చెందిన హ‌సి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story