దారుణం.. చికెన్ వండలేదని భార్య తల పగలగొట్టాడు
చికెన్ వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహించాడు భర్త. కోపంతో భార్య తల పగలగొట్టిన భర్త, ఆమె చేయి విరిచాడు.
By అంజి Published on 9 March 2023 12:27 PM GMTచికెన్ వండలేదని భార్య తల పగలగొట్టాడు
చికెన్ వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహించాడు భర్త. కోపంతో భార్య తల పగలగొట్టిన భర్త, ఆమె చేయి విరిచాడు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తలపై లోతైన గాయం ఉంది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అదే సమయంలో నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ధూళివందన్ (హోలీ) రోజున జరిగింది. ఇక్కడ నివసిస్తున్న యువకుడు మార్కెట్ నుంచి చికెన్ తెచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను చికెన్ చేయమని అడిగాడు. కానీ, ఆహారం సిద్ధంగా ఉందని భార్య భర్తకు చెప్పింది. ప్రస్తుతం చికెన్ వండలేను, సాయంత్రం చేస్తానని చెప్పింది.
చికెన్ వండేందుకు భార్య నిరాకరించడంతో భర్త చిరాకుపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఇంటి ఆవరణలో ఉన్న కర్రను తీసుకొచ్చి భార్యను నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. భర్త కర్రతో భార్య తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో భార్య తలపై బలమైన గాయమై రక్తం కారింది. భర్త కొట్టడంతో ఆ మహిళ ఒక చేయి కూడా విరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో గాయపడిన మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కూరగాయలు తీసుకురమ్మనందుకు భార్యను కొట్టాడు
కొన్ని రోజుల క్రితం ఘజియాబాద్‌లో ఓ చిన్న విషయానికి భర్త.. భార్యను పరిగెత్తించి కొట్టాడు. బాధితురాలైన భార్య ఆరోహి మిశ్రా చేసిన ఏకైక తప్పు ఏమిటంటే, ఆమె తన భర్త సౌరభ్‌ను కూరగాయలు తీసుకురావాలని కోరింది. తాగుబోతు భర్తకు భార్య చెప్పిన మాటలు నచ్చలేదు. రాత్రి 11 గంటల సమయంలో భార్యను రోడ్డుపై పరుగెత్తిచ్చుకుంటూ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా అపట్లో తెరపైకి వచ్చింది.